Palakurthi: పాలకుర్తిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Palakurthi: పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 20 Aug 2026 8:51 PM IST
Palakurthi
X

Palakurthi: పాలకుర్తిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

జనగామ: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ జయంతి పురస్కరించుకొని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోగు శ్రీనివాస్ అధ్యక్షతన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సద్భావనా దివస్‌ను నిర్వహిస్తారని తెలిపారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో, దేశంలో ఆధునిక సమాచార సాంకేతికతకు పునాది వేయడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు.

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధి, విద్యా రంగంలో ఆధునికీకరణకు ఆయన ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కారుపోతుల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధార్, కార్యదర్శి పెనుగొండ రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు గాదెపాక భాస్కర్, బీసీ సెల్ అధ్యక్షులు ఐలేష్ యాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా భాస్కర్, మండల నాయకులు కమ్మగని నాగయ్య, పన్నీరు వెంకన్న, భూమా రంగయ్య, సోమల్లయ్య, సుధాకర్ రెడ్డి, మైనార్టీ నాయకులు సలీమ్, అబ్బసలీ, కిషన్ నాయక్, సురేష్, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story