Gudur: పంచాయతీ కార్యాలయంలో ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళి!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

B NARASIMHA, GUDUR
Published on: 6 Aug 2026 5:30 PM IST
Gudur
X

Gudur: పంచాయతీ కార్యాలయంలో ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళి!

గూడూరు: గూడూరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు.

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ చేసిన సేవలు, చూపిన మార్గం అమూల్యమైనవని కొనియాడారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు.

​గ్రామపంచాయతీ ప్రతినిధులు అధికారులు ఉపసర్పంచ్ చంటి స్వామి, గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుమల, టౌన్ కార్యదర్శి సూర శ్రీను. ​కాంగ్రెస్ పార్టీ నాయకులు: మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాసమల్ల రాములు, టౌన్ యూత్ కాంగ్రెస్ నాయకులు షాజహాన్, రాజేష్.​వార్డు సభ్యులు. పత్యం వెంకన్న, వాంకుడోత్ శ్రీనివాస్, గార్లపాటి శిరీష, చీరబోయిన కుమార్, గోనే శిరీష శోభన్. ​వీరితో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయశంకర్ గారికి నివాళులర్పించారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story