Rayaparthi: రాయపర్తిలో ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి ఉత్సవాలు!
Rayaparthi: నడికుడ మండలం రాయపర్తిలో ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి.. నివాళులర్పించిన సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్.
Rayaparthi: రాయపర్తిలో ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి ఉత్సవాలు!
Rayaparthi: హనుమకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తి గ్రామంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్ ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా రాయపర్తి గ్రామం సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్ మాట్లాడుతూ కాళోజీ తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచారని కొనియాడారు. తన కలంతో నిజాన్ని నిర్భయంగా చెప్పిన గొప్ప కవి కాళోజీ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో కాళోజీ పాత్ర మరువలేనిదని, యువత ఆయన రచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Next Story




