Warangal: రాత్రి వేళల్లో వచ్చే ఫిర్యాదులపై అలర్ట్‌గా ఉండండి సీపీ!
Warangal: కమిషనరేట్ వెస్ట్‌జోన్ పరిధిలోని స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సీపీ ఎన్.శ్వేత, ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు
Warangal: రాత్రి వేళల్లో వచ్చే ఫిర్యాదులపై అలర్ట్‌గా ఉండండి సీపీ!
వరంగల్: పోలీస్ స్టేషన్ వచ్చే ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని భరోసాని కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత,ఐ.పి.ఎస్ పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం వెస్ట్‌జోన్ పరిధిలోని స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం సందర్శించారు.
ఈ ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు వెస్ట్‌జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ పూల మొక్కను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించడంత పాటు, స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించడంతో పాటు, స్టేషన్ పరిధిలో తరుచు అధిక సంఖ్యలో జరిగే నేరాలు, స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ప్రస్తుత గ్రామాల్లో స్థితిగతులు, స్టేషన్ నిర్వహణ, పోలీస్ కమిషనర్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ వేణు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా అధికారులు, సిబ్బంది ఉద్యేశిస్తూ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్నామని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు ఫిర్యాదుదారునికి రశీదు అందజేయాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను పోలీస్ స్టేషన్ ఎక్కువ సేపు వేసి వుండే పరిస్థితి రాకుండా స్టేషన్ అధికారులు, సిబ్బంది చూడాలని. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
పోలీస్ కమిషనర్ వెంట్ వెస్ట్‌జోన్ డిసిపి రాజమహేంద్రనాయక్, ఏసిపి భీంశర్మ, ఇన్స్‌స్పెక్టర్ వేణు, ఎస్.ఐ మనిషా వున్నారు.




