Peddapur: పెద్దాపూర్ దొంగతనం, ఇల్లు తగలబెట్టిన కేసులో నిందితుడి అరెస్ట్!

Peddapur: పెద్దాపూర్‌లో చోరీ చేసి, నిప్పు పెట్టిన నిందితుడు శివరాజ్ అరెస్ట్. ఆత్మకూర్ పోలీసుల తనిఖీల్లో రూ.2.42 లక్షల విలువైన సొత్తు, ద్విచక్ర వాహనం స్వాధీనం.

M PRABHAKAR, PARAKAL
Published on: 21 Aug 2026 5:43 PM IST
Peddapur
X

Peddapur: పెద్దాపూర్ దొంగతనం, ఇల్లు తగలబెట్టిన కేసులో నిందితుడి అరెస్ట్!

Peddapur: పెద్దాపూర్ గ్రామంలో దొంగతనం చేసి ఇంటికి నిప్పు పెట్టిన నిందితుడు అరెస్ట్ – రూ.2,42,000/- విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం తేది 21.08.2026 న ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కంపేట గ్రామం సమ్మక్క ఆర్చ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి మోటార్ సైకిల్‌పై వచ్చి పోలీసులను చూసి భయపడి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని వెంబడించి పట్టుకొని విచారించారు.

విచారణలో అతను నాగనబోయిన శివరాజ్, తండ్రి: శ్రీను, వయస్సు: 22 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: కూలీ, నివాసం: పెద్దాపూర్ గ్రామం, ఆత్మకూర్ మండలం, హనుమకొండ జిల్లాగా గుర్తించారు.నిందితుడు కూలీ పనుల ద్వారా వచ్చే ఆదాయం తన మద్యం సేవనం, జల్సాలు మరియు ఇతర ఖర్చులకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడించాడు. గతంలో కూడా 2025 సంవత్సరంలో పెద్దాపూర్ గ్రామంలో చీకటి పద్మ ఇంటిలో దొంగతనం చేసి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపాడు.

తేది 18.08.2026 రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో, పెద్దాపూర్ గ్రామంలో ఉన్న తన పెద్దనాన్న నాగనబోయిన రవి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. తాళం పగులగొడితే శబ్దం వస్తుందని భావించి, ఇంటి తలుపులను బలంగా పైకి లేపి ఒక వైపు తలుపును తొలగించి అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించాడు.

అనంతరం హాల్ రూమ్‌లో ఉన్న బీరువాను తెరిచి, అందులో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు హారం, 0.5 తులాల చెవి కమ్మలు, చెంప చేరాలు, ముక్కు పుడకలు కలిపి మొత్తం సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 42 తులాల వెండి కాళ్ల పట్టీలు రెండు జతలు, రెండు వెండి బ్రేస్‌లెట్లు మరియు రూ.20,000/- నగదును దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.

నిందితునికి మరియు బాధిత కుటుంబానికి గతంలో కుటుంబ, ఆస్తి వివాదాలు ఉన్నాయని, ఆ వివాదాల నేపథ్యంలో తనపై దొంగతనం చేసిన అనుమానం రాకుండా మరియు అనుమానాన్ని మరొక వ్యక్తిపై మళ్లించాలనే ఉద్దేశంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక అగ్గిపెట్టెతో పక్కన ఉన్న సంచికి నిప్పంటించి ఇంటికి నిప్పు పెట్టినట్లు వెల్లడించాడు.

అనంతరం ఇంటి వెనుక వైపు సీసీ కెమెరాలు ఉండటంతో, కెమెరాలకు చిక్కకుండా ముందు వైపు నుంచి బయటకు వచ్చి తన ద్విచక్ర వాహనంపై పారిపోయాడు.దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తేది 21.08.2026 న వరంగల్ వైపు వెళ్తుండగా అక్కంపేట గ్రామంలోని సమ్మక్క ఆర్చ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు.నిందితుడి వద్ద నుండి సుమారు రూ.2,42,000/- విలువైన క్రింది దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు:

1)సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు – విలువ రూ.1,80,000/-

2)సుమారు 42 తులాల వెండి ఆభరణాలు – విలువ రూ.42,000/-

3)నగదు రూ.20,000/-

4)ఒక iQOO కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్,

5)Honda Shine మోటార్ సైకిల్,

నిందితుడు దొంగతనానికి పాల్పడి, అనంతరం నేరాన్ని దాచిపెట్టే ఉద్దేశంతో ఇంటికి నిప్పు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు పంచుల సమక్షంలో దొంగిలించిన సొత్తు, మొబైల్ ఫోన్ మరియు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం గౌరవనీయులైన పరకాల జడ్జ్ గారి ముందు హాజరుపరచడం జరిగింది.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story