Parkal: ఘనంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు
Parkal: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరిపాయి. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించారు.
Parkal: ఘనంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు
పరకాల: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున యువకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవను కొనియాడారు. ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ కు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




