Parkal: విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా కౌన్సిలర్ పూర్ణాచారి!

Parkal: పరకాలలో అకాల మరణం చెందిన బత్తుల శాంతమ్మ కుటుంబాన్ని 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి పరామర్శించి బియ్యం, నిత్యావసరాలు అందజేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 10 Sept 2026 7:12 PM IST
Parkal
X

Parkal: విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా కౌన్సిలర్ పూర్ణాచారి!

పరకాల: అనారోగ్య కారణాలతో ఇటీవల గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో అకాల మరణం చెందిన బత్తుల శాంతమ్మ (పద్మశాలి) కుటుంబాన్ని పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి పరామర్శించారు.

పరకాల పట్టణానికి చెందిన బత్తుల మల్లేశం, వెంకటేశ్వర్లు, విష్ణుమూర్తిల తల్లి శాంతమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబానికి తన వంతు సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పూర్ణాచారి భరోసా కల్పించారు. ఆపద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో శాంతమ్మ కుటుంబ సభ్యులతో పాటు వీర్ల సదానందం, సూదమల్ల రాజయ్య, పొడిచెట్టి సాంబమూర్తి, పప్పుల సుధాకర్, కుమార్ స్వామి, బూర వెంకటేశ్వర్లు, మంత్రి శ్యామ్, గంగోజుల విజేందర్ తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story