Parkal: మూతపడిన ప్రభుత్వ ఆసుపత్రిపై బీజేపీ నేత కాళీప్రసాద్ రావు ధ్వజం

Parkal: పరకాలలో ప్రభుత్వ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించి మూసివేశారని బీజేపీ నేత డాక్టర్ పగడాల కాళీప్రసాద్‌రావు ఆరోపించారు. విలేకరుల సమావేశంలో విమర్శలు.

M PRABHAKAR, PARAKAL
Published on: 24 Aug 2026 3:59 PM IST
Parkal
X

Parkal: మూతపడిన ప్రభుత్వ ఆసుపత్రిపై బీజేపీ నేత కాళీప్రసాద్ రావు ధ్వజం

పరకాల: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్‌రావుపరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో పరకాల స్వర్ణ గార్డెన్స్ అంబేద్కర్ సెంటర్లో మీడియా సమావేశం ఏర్పాటు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్‌రావు. ఎస్ ఐ ఆర్ హనుమకొండ జిల్లా ప్రముఖు రావు అమరేందర్ రెడ్డి.

రాష్ట్ర నాయకులు సిరంగి సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డా.కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పరకాలలో ప్రభుత్వ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని, ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆసుపత్రి ప్రస్తుతం మూతపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు.

ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితిని ప్రజలు స్వయంగా సందర్శించి, అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని కోరారు. ప్రజలకు అన్యాయం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సభకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించాల్సి ఉండగా, పలువురు నాయకులను అరెస్టు చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదని ఆరోపించారు.

ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ఆధారంగా పాలన సాగిస్తోందని విమర్శించిన కాళీప్రసాద్‌రావు, హైదరాబాద్ భూములపై కన్నేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 22-A నిబంధనల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా పరకాల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు సిరంగి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

పరకాలకు వచ్చిన ముఖ్యమంత్రి ఏ అభివృద్ధి పనులు చేపట్టారో ప్రజలకు స్పష్టంగా వివరించాలని ప్రశ్నించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించి ప్రారంభించాల్సి ఉండగా, నాయకులను అరెస్టు చేసి కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story