Palakurthy: పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఝాన్సీరెడ్డి హామీ!

Palakurthy: పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు.

S MAHENDER, PALAKURTHI
Published on: 8 Jun 2026 10:09 AM IST
Palakurthy
X

Palakurthy: పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఝాన్సీరెడ్డి హామీ!

జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొత్త, పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు.

ఆదివారం పాలకుర్తి మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని లక్ష్మక్కపెల్లి గ్రామానికి చెందిన 4వ వార్డు సభ్యుడు ప్రభుదాస్‌ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలే ప్రధాన బలమని, వారి సంక్షేమం, గౌరవానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారావత్ సురేష్ నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ, సొసైటీ డైరెక్టర్లు, వివిధ హోదాల్లో ఉన్న మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story