Palakurthi: పాలకుర్తి పీఎస్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. త్వరలో రిటైర్ కానున్న ఎస్‌ఐ రాజి రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ.
Palakurthi: పాలకుర్తి పీఎస్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!
Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ శ్రీ జానకి రామ్ రెడ్డి గారు, ఎస్‌ఐ శ్రీ పవన్ కుమార్ గారు, ఏఎస్ఐ శ్రీ రాజి రెడ్డి గారు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఐ శ్రీ జానకి రామ్ రెడ్డి గారు, అక్టోబర్ నెలలో పదవీ విరమణ చేయనున్న ఏఎస్ఐ శ్రీ రాజి రెడ్డి గారి దీర్ఘకాల సేవలను గౌరవిస్తూ, ఆయన చేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపజేశారు.
దేశ సేవలో ఏఎస్ఐ రాజి రెడ్డి గారు అందించిన సేవలను సీఐ జానకి రామ్ రెడ్డి గారు అభినందించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బంది జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story




