Palakurthi: పాలకుర్తి ప్రగతి విద్యాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు!
Palakurthi: పాలకుర్తి ప్రగతి విద్యాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యార్థుల కృష్ణుడి, గోపికల వేషధారణలు, ఉట్టి కొట్టే సంబరాలు అలరించాయి.
Palakurthi: పాలకుర్తి ప్రగతి విద్యాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు!
Palakurthi: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రగతి విద్యాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టి కొట్టే సంబరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.
పాఠశాల విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో విచ్చేసి సందడి చేశారు. చేతిలో పిల్లనగ్రోవి, తలపై నెమలి పింఛంతో బుజ్జి కృష్ణుల ముద్దులొలికే హావభావాలు, గోపికల నృత్యాలు చూసేవారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్సాహభరిత వాతావరణంలో విద్యార్థుల కేరింతల నడుమ ఉట్టి కొట్టే పోటీలను నిర్వహించారు. చిన్నారులు పోటీపడి ఉట్టిని కొట్టడంతో పాఠశాల ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మార్మోగింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




