Nidigonda: నిడిగొండలో ఎనిమిది నెలలుగా అసంపూర్తిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు!

Nidigonda: నిడిగొండ సర్వీస్ రోడ్డుపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం తవ్విన గుంత ప్రమాదకరంగా మారడంతో 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 7 July 2026 4:34 PM IST
Nidigonda
X

Nidigonda: నిడిగొండలో ఎనిమిది నెలలుగా అసంపూర్తిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు!

Nidigonda: జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ విలేజ్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం గుంత తవ్వి ఎనిమిది నెలలు అవుతుంది. గుంత తవ్వి అరకొర పనులు చేసి వదిలేశారు. ఇది ప్రమాదకరంగా ఉంది. చుట్టు పక్కల పది గ్రామాల ప్రజలు ఈ సర్వీసు రోడ్డుపై నుంచే రాకపోకలు సాగించాలి.

దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు సర్వీస్ రోడ్డు మొత్తం కుంగిపోయే ప్రమాదం ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగక ముందే దయచేసి దీనిపై చర్యలు తీసుకోగలరని గ్రామస్తులతో పాటు చుట్టు పక్క గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story