Hanamkonda: పాఠశాల విద్యార్థులకు ‘నషా ముక్త్ విద్యాలయ’ అవగాహన సదస్సు!
Hanamkonda: పరకాల జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఉపాధ్యాయులు.
Hanamkonda: పాఠశాల విద్యార్థులకు ‘నషా ముక్త్ విద్యాలయ’ అవగాహన సదస్సు!
Hanamkonda: పరకాల పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాల లో విద్యార్థులకు పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలు మరియు ఇతర వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు నషా ముక్త్ విద్యాలయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
పాఠశాల పరిసర ప్రాంతాలకు దూరంగా పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల సంబంధించి ఎటువంటి దుకాణాలు ఉండకూడదని తెలిపారు. వీటివల్ల విద్యార్థులు త్వరగా ఆకర్షణకు లోనై తద్వారా బానిసలుగా మారే అవకాశం ఉన్నందువల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా పెట్టి భావితరాలకు బాటలు వేసిన విధంగా ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, విద్యా మరియు సామాజిక నష్టాలను వివరించడం జరిగింది. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన మరియు వ్యసన రహిత జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
అలాగే విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సమాజంలో కూడా మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.
“మాదకద్రవ్యాలకు నో చెప్పండి – జీవితానికి అవును చెప్పండి” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించడం జరిగింది.




