Narsimhulapeta: జగ్గు తండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భూక్య లక్పతి
Narsimhulapeta: నర్సింహులపేట మండలం జగ్గు తండా జీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భూక్య లక్పతి ఏకగ్రీవ ఎన్నిక. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్.
Narsimhulapeta: జగ్గు తండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భూక్య లక్పతి
నర్సింహులపేట: డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచందర్ నాయక్ గారి ఆదేశాల మేరకు, నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి, సమన్వయ కమిటీ చైర్మన్ దాస్రు నాయక్ ఆధ్వర్యంలో, సమన్వయ కమిటీ సభ్యుల సహకారంతో జగ్గు తండా జి.పి. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భూక్య లక్పతిని జగ్గు తండా జి.పి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన అధ్యక్షుడు భూక్య లక్పతికి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన అధ్యక్షుడు భూక్య లక్పతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచందర్ నాయక్ గారికి, మండల అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి గారికి, సమన్వయ కమిటీ చైర్మన్ దాస్రు నాయక్ గారికి, సమన్వయ కమిటీ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
జగ్గు తండా జి.పి. పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానని భూక్య లక్పతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




