Narsampet: రూ.2.20 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Narsampet: నర్సంపేట పట్టణంలోని నవదుర్గ ఎంటర్ప్రైజెస్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి రూ.2.20 లక్షల విలువైన నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 27 Aug 2026 10:11 PM IST
Narsampet
X

Narsampet: రూ.2.20 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

నర్సంపేట: పట్టణం లో ని నవ దుర్గ ఎంటర్ప్రైజెస్ షాపు లో అక్రమంగా ఉన్న నిషేధిత అంబర్ గుట్కా లని పక్క సమాచారం తో నర్సంపేట పోలీసులు తనిఖి చేసి 2 లక్షల 20 వేల రుపాయల విలువగల అంబర్ గుట్కా లని పట్టుకొని స్వాదినం చేసుకున్నారు. యజమాని పరమార్ పురాన్సింగ్ పై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నమని ఎస్సై గూడ అరుణ్ కుమార్ తెలిపారు.

ఆలాగే రెండు రోజుల క్రితం కూడా 2 లక్షల నిషేదిత అంబర్ గుట్కా లని పట్టుకొని రెండు షాపు ల యజమాని ల పై కేసు నమోదు చేసారు. పట్టణం లో పలు షాపుల్లో లక్షల లో నిషేధిత అంబర్,గుట్కాలు నర్సంపేట పోలీసులు పట్టుకోవడం పై పలువురు ప్రశంశిస్తున్నారు. మరియు కొందరు సిండికేట్ గా ఏర్పడి ఈ నిషేధిత అంబర్, గుట్కా లను అక్రమంగా అమ్ముతున్నారని ఇంకా తనిఖీ లు చేసి చర్యలు తీసుకొవాలని ప్రజలు కోరుతున్నారు.

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET

Next Story