Hanamkonda: వాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని

Hanamkonda: హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

AJAY, HANMAKONDA
Published on: 10 Jun 2026 1:24 PM IST
Hanamkonda
X

Hanamkonda: వాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని

Hanamkonda: హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఇటీవల నిర్వహించిన వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులుగా దొంతి తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులుగా నాగవెళ్లి యుగేందర్, కార్యదర్శిగా బిరుదురాజు రఘురామరాజు, సంయుక్త కార్యదర్శిగా తాళ్లపెల్లి రవీందర్, కోశాధికారిగా సలీం, కార్యవర్గ సభ్యులుగా సంకేపల్లి దివాకర్ రెడ్డి, ఆడెపు భాస్కర్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో వాకర్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లోనూ ముందుండి పనిచేస్తూ ఆదర్శంగా నిలవాలని నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు. నూతన కమిటీ విజయవంతంగా పనిచేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వాకర్లు తదితరులు పాల్గొన్నారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story