Bhupalpally: మైలారం గుహలకు ఎకోటూరిజం మహర్దశ ఫారెస్ట్ సీసీఎఫ్ సందర్శన!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైలారం గుహలను కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ సందర్శించి, ఎకోటూరిజం కేంద్రంగా అభివృద్ధిపై సమీక్షించారు.
Bhupalpally: మైలారం గుహలకు ఎకోటూరిజం మహర్దశ ఫారెస్ట్ సీసీఎఫ్ సందర్శన!
Bhupalpally: ఘనపురం మండలం మైలారం గుహలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి, ఎకోటూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించేందుకు కాళేశ్వరం జోన్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ . ప్రభాకర్ బుధవారం మైలారం గుహలను సందర్శించారు.
ఈ సందర్భంగా గుహల సహజ సౌందర్యం, భౌగోళిక ప్రత్యేకతలు, పరిసర అటవీ ప్రాంతాలను పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా మైలారం గుహలను అభివృద్ధి చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఎకోటూరిజం ప్రదేశంగా రూపుదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ప్రకృతి సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా పర్యాటక సౌకర్యాలను కల్పించడం, సందర్శకులకు గుహల ప్రత్యేకతలను పరిచయం చేయడం వంటి అంశాలపై పరిశీలన జరిపారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ అప్పలకొండ, భూపాలపల్లి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (చెల్పూర్ రేంజ్) చంద్ర మౌళి, సెక్షన్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్, బీట్ ఆఫీసర్ గీతతో పాటు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
మైలారం గుహలను పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి అనుసంధానం చేస్తే ఈ ప్రాంతం ప్రముఖ ఎకోటూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.




