Jangaon: ముత్యాలమ్మ బోనాల మహోత్సవం తలపై బోనం ఎత్తిన యశస్విని రెడ్డి!
Jangaon: జనగామ జిల్లా దేవరుప్పుల ముత్యాలమ్మ బోనాల మహోత్సవంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. తలపై బోనం ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లింపు.
Jangaon: ముత్యాలమ్మ బోనాల మహోత్సవం తలపై బోనం ఎత్తిన యశస్విని రెడ్డి!
Jangaon: దేవరుప్పుల ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.. అనంతరం మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు. వేదపండితులు ఆమెకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల నడుమ జాతర కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ముత్యాలమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. రైతులకు సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.




