Jangaon: జనగామలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ.. పేదలకు పండ్లు, ఆహార పంపిణీ!
Jangaon: జనగామ రైల్వే స్టేషన్ వద్ద ముస్లిం డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. పేదలకు పండ్లు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.
Jangaon: జనగామలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ.. పేదలకు పండ్లు, ఆహార పంపిణీ!
జనగామ: జనగామ జిల్లా ముస్లిం డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్-ఉన్-నబీ వేడుకలను జనగామ రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లోని పేదలు, నిరుపేదలకు పండ్లు, డబుల్ రొట్టె మరియు ఫ్రూటీ పానీయాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జమాల్ షరీఫ్, అడ్వకేట్ మాట్లాడుతూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచానికి మానవత్వం, ప్రేమ, శాంతి, దయ మరియు సోదరభావం వంటి గొప్ప సందేశాలను అందించారని అన్నారు. ప్రవక్త వారి జీవితం, నిజాయితీ, కరుణ, మంచి నడవడిక ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
ప్రవక్త చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ, సమాజంలో శాంతి, సోదరభావం మరియు మానవతా విలువలను పెంపొందించాలని జమాల్ షరీఫ్ పిలుపునిచ్చారు. పేదలు, నిరుపేదలను ఆదుకోవడం, వారి కష్టాల్లో తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ షకీల్, ఎం.డి. కమాలుద్దీన్, ఎం.డి. సాజిద్, ఎం.డి. అన్వర్, ఎం.డి. హఫీజ్, ఎం.డి. కలీం ఉద్దీన్, ఎం.డి. ముస్తఫా, ఎం.డి. అనీస్, ఎం.డి. రిజ్వాన్, ఎం.డి. జబ్బార్, అబ్దుల్ మన్నాన్ రాజీ తదితరులు పాల్గొన్నారు.




