Mulugu: ఫిజికల్ వెరిఫికేషన్‌కు వ్యతిరేకంగా రైస్ మిల్లర్ల సమ్మె
Mulugu: ములుగు జిల్లాలో ఫిజికల్ వెరిఫికేషన్, పెనాల్టీలకు వ్యతిరేకంగా రైస్ మిల్లర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. మిల్లులు మూతపడే ప్రమాదముందని ఆందోళన.
Mulugu: ఫిజికల్ వెరిఫికేషన్‌కు వ్యతిరేకంగా రైస్ మిల్లర్ల సమ్మె
ములుగు: ములుగు జిల్లా లో ని రైస్ మిల్లులపై ప్రభుత్వం చేపడుతున్న ఫిజికల్ వెరిఫికేషన్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైస్ మిల్లర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.
ఫిజికల్ వెరిఫికేషన్‌లో షార్ట్‌ఫాల్ కనిపిస్తే 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ విధించడం వల్ల మిల్లర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బాదం ప్రవీణ్ తెలిపారు.
సార్టెక్స్ ప్రక్రియ, తొమ్మిది నెలల పాటు ధాన్యం నిల్వ ఉండటంతో తేమ,బరువు తగ్గడం, డిస్‌కలర్, డ్యామేజ్ వంటి కారణాలతో ధాన్యం-బియ్యం మధ్య సుమారు 10 శాతం వేరియేషన్ ఏర్పడుతోందని పేర్కొన్నారు.
నష్టపోయిన ధాన్యాన్ని లిక్కర్, ఇథనాల్ పరిశ్రమలకు విక్రయించి వచ్చే మొత్తంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తున్నామని వివరించారు.
ఈ పరిస్థితుల్లో షార్ట్‌ఫాల్ పేరుతో పెనాల్టీలు విధిస్తే రాష్ట్రంలోని రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.




