Mulugu: ములుగులో విచిత్రం: గృహజ్యోతి స్థానంలో లక్షల్లో కరెంట్ బిల్లు!

Mulugu: ములుగు జిల్లా ప్రేమ్‌నగర్‌లో పెంకుటింటికి రూ.1.43 లక్షల కరెంట్ బిల్లు. గృహజ్యోతి వర్తించకుండా బిల్లేసి కనెక్షన్ తొలగించారంటూ బాధితుల ఆవేదన.

PONNALA SWAMY, MULUGU
Published on: 2 Sept 2026 7:41 AM IST
Mulugu
X

Mulugu: ములుగులో విచిత్రం: గృహజ్యోతి స్థానంలో లక్షల్లో కరెంట్ బిల్లు!

Mulugu: ములుగు జిల్లాలో ని ప్రేమ్ నగర్ లో ప్రసాద్ దంపతుల గృహ వినియోగానికి విద్యుత్ బిల్లు 1లక్ష 43 వేలు విద్యుత్తు బిల్లు లక్షల్లో రావడంతో అయోమయానికి గురవుతున్న ప్రసాద్ దంపతులు బిల్ చెల్లించే వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కనెక్షన్ రిమూవ్ చేసిన విద్యుత్ అధికారులు

2023వ సంవత్సరం నుండి గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంటు బిల్లు జీరో వచ్చేది ఆగస్టు నెల లో వేలల్లో బిల్లు వచ్చిందని బిల్లు ఇచ్చి వెళ్లిన విద్యుత్ శాఖ అధికారులు ఆగస్టు నెలలో మొత్తం బిల్లు రూ.1,43,136 కట్టాలంటూ విద్యుత్ అధికారులు వేధింపులు.

రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు నిచ్చిన లక్షల్లో కరెంట్ బిల్లు వేశారంటూ ఆవేదన అంత విద్యుత్ బిల్లు చెల్లించలేమంటూ స్పష్టం చేసిన బాధితులు ప్రసాద్ దంపతులు ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్ నగర్ గ్రామానికి చెందిన కొమ్మినేని ప్రసాద్ దంపతులు మాట్లాడుతూ పెంకుటింట్లో నివాసం ఉంటున్న మాకు 2023వ సంవత్సరం మొదట్లో గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంటు విని యోగంతో మూడు నెలల పాటు జీరో బిల్లు వచ్చింది.

తరవాత నుంచి సిబ్బంది అసలు బిల్లు ఇవ్వలేదు అని ఆగస్టు నెలలో మొత్తం బిల్లు రూ.1,43,136 బిల్లు ఇచ్చి బిల్లును చెల్లించాలని, బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు ప్రసాద్ ఇంటికి విద్యుత్తు సర్వీస్ కనెక్షన్ తొలగించారు బిల్ చెల్లించే వరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేమని చెప్పి వెళ్లిపోయారు.

ప్రజా ప్రభుత్వం 200 యూనిట్లకు ఉచిత కరంట్ అని చెప్పి విద్యుత్ అధికారులు ఆ ఇంటికి లక్షల్లో బిల్లులు వేసి చెల్లించాలని విద్యుత్ అధికారులు ఇబ్బందులకు గురి చేయడంతో మీడియాను ఆశ్రయిస్తూ అంత బిల్లు కట్టలేమని స్పష్టం చేశారు.ఉచిత కరెంటు పేరిట విద్యుత్ అధికారులలు అధిక బిల్లుల పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story