Mulugu: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

Mulugu: ములుగు జిల్లా కోర్టుల్లో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, క్రిమినల్ తదితర కేసులను రాజీ మార్గంతో పరిష్కరించుకోవాలని కోరారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 2 Sept 2026 5:26 PM IST
Mulugu
X

Mulugu: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

ములుగు జిల్లా: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలనుసారం ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ- ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్. జిల్లాలోని కోర్టులలో ఈనెల 12.09:2026 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుచున్నదనీ తెలిపిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. చండీశ్వరి దేవి.

ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్ కేసులు,సివిల్ కేసులు,ప్రీ-లిటిగేషన్ కేసులు, బ్యాంకు, ఎలక్ట్రిసిటీ, భూతగాదా కేసులు, వివాహ/కుటుంబ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, చెక్-బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులను పరిష్కరించ బడును కావున ఈ నెల 12:09:2026 రోజున లోక్ అదాలత్ నందు హాజరు అయ్యి. తమ కేసులను పరిష్కరించుకొనగలరని జిల్లాలోని ఇరువర్గ కక్షిదారులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలరని కోరారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story