Mulugu: ట్రైబల్ యూనివర్సిటీ భూముల్లో ములుగు మున్సిపాలిటీ చెత్త కుప్పలు!

Mulugu: ములుగు మున్సిపాలిటీ చెత్తను సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ భూముల్లో వేస్తున్న సిబ్బంది.

PONNALA SWAMY, MULUGU
Published on: 5 Sept 2026 8:29 AM IST
Mulugu
X

Mulugu: ట్రైబల్ యూనివర్సిటీ భూముల్లో ములుగు మున్సిపాలిటీ చెత్త కుప్పలు!

Mulugu: ములుగు మున్సిపాలిటీలో సేకరించిన చెత్త వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ లో వేసి కాల్చి వేయకుండా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో భూముల్లో చెత్త వ్యర్ధాలను వేస్తున్న సిబ్బంది.

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని మాధవరావుపల్లిలో స్మశాన వాటికకు దగ్గరలోనే చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుచేశారు జిల్లా అధికారులు సేకరించిన చెత్త వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ లో చెత్త వేయకుండా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ భూముల్లో వేస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ భూముల్లో వేయడంతో డంపింగ్ చేస్తున్న చెత్తాచెదారం వ్యర్ధాలతో దుర్గంధ వాసన రావడంతో సమీపంగా ఉన్న కేజీ బీవీ హాస్టల్ విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు.

సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ లోనే కాల్చి బూడిద చేయకుండా బహిరంగ ప్రదేశాల్లో వేస్తుండడంతో అటువైపు నుండే పశువులు మేతకు వెళ్లే దారి లో వేయడంతో పశువులు వ్యర్ధనం తిని అనారోగ్య పాడిన పడుతున్నా యని అంటున్నారు.

ఇంత వరకు డంపింగ్ యార్డ్ ప్రదేశాల వైపు చూడని ములుగు మున్సిపాలిటీ చైర్మన్ కమిషనర్ అధికారులు,వెంటనే మున్సిపల్ చైర్మన్,కమిషనర్ స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు స్థానిక ప్రజలు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story