Mulugu: కమలాపురం పాఠశాలలో 'అమ్మ పేరుతో ఒక మొక్క' కార్యక్రమం
Mulugu: ములుగు జిల్లా కమలాపురం పాఠశాలలో 'అమ్మ పేరుతో ఒక మొక్క' కార్యక్రమం. స్వంత ఖర్చులతో 20 కొబ్బరి మొక్కలు అందజేసి నాటిన మునిగాల రాకేష్.
Mulugu: కమలాపురం పాఠశాలలో 'అమ్మ పేరుతో ఒక మొక్క' కార్యక్రమం
ములుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ZPHS కమలాపురం పాఠశాలలో నిర్వహించిన “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, జన విజ్ఞాన వేదిక ములుగు జిల్లా హెల్త్ విభాగం కన్వీనర్ మునిగాల రాకేష్ తన స్వంత ఖర్చులతో సుమారు రూ.10 వేల విలువైన 20 కొబ్బరి మొక్కలను పాఠశాలకు అందజేశారు.
NGC ఉపాధ్యాయులు వేణుమాధవ్ రెడ్డి, రాజేశ్వరరావులకు మొక్కలను అందించిన అనంతరం రాకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు.
మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా సంరక్షించి, చెట్లుగా పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని రాకేష్ తెలిపారు. పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణంపై చిన్ననాటి నుంచే బాధ్యతాభావం పెంపొందుతుందని అన్నారు.
ఈ సందర్భంగా రాకేష్ తండ్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని, తన కుమారుడు స్వంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మరింత సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు నాటిన కొబ్బరి మొక్కలను తమ సొంత మొక్కలుగా భావించి వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు.
“ఒక్కొక్కరు ఒక్క మొక్కను నాటి.. దాన్ని సంరక్షిస్తేనే పచ్చని భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల GHM గడ్డి శ్రీనివాస్, జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, JVV హెల్త్ విభాగం కన్వీనర్ మునిగాల రాకేష్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు ప్రసాద్, సునీత, నాగలక్ష్మి, నాగమ్మ, వేణుమాధవ్ రెడ్డి, రమేష్, మౌలాలి, నరేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




