Mulugu: గిరిజన రిజర్వేషన్ల పెంపునకు 4 ఏళ్లు

Mulugu: ములుగు జిల్లా మల్లంపల్లిలో గిరిజన రిజర్వేషన్ల పెంపు వేడుకలు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్న బీఆర్ఎస్ శ్రేణులు.

PONNALA SWAMY, MULUGU
Published on: 16 Sept 2026 5:11 PM IST
Mulugu
X

Mulugu: గిరిజన రిజర్వేషన్ల పెంపునకు 4 ఏళ్లు

ములుగు: గిరిజనుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తండాలను గ్రామ పంచాయతీల గా మార్చారు.

తండాలను, గిరిజన గూండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజనులకు రాజకీయంగా, సామాజికంగా మరింత ప్రాధాన్యత లభించింది. గిరిజన బిడ్డలు ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇది ఎంతో దోహద పడింది .

గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవటం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గిరిజన సమాజం తరఫున కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తు.17-09-2026రోజున ఉదయం 11గంటలకు బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతీ గారి సూచన మేరకు మల్లంపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయబడును.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు గారు హాజరవుతారు కావున కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గిరిజన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు ముఖ్య నాయకులు,లంబాడి సామాజిక వర్గం కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో హాజరు కాగలరు-మీ పాలెపు శ్రీనువాస్

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU