Mulugu: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు!

Mulugu: ములుగులో జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించిన అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 29 Aug 2026 5:02 PM IST
Mulugu
X

Mulugu: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు!

Mulugu: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన రోడ్డు భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి అధ్యక్షతన నూతన కలెక్టరేట్ తన ఛాంబర్ లో రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై మల్లంపల్లి, పందికుంట, యువజన శిక్షణ కేంద్రం, జాకారం, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంతాల్లో అవసరమైన చోట్ల వేగ నియంత్రణ పట్టీలు, సూచిక బోర్డులు,రేడియం స్టికర్లు, ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జాతీయ రహదారికి అనుసంధానమయ్యే రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయా అనుసంధాన ప్రాంతాల వద్ద వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా సూచిక, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ టి ఓ ఈశ్వర్ సింగ్ ఠాగూర్, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, పి ఆర్ ఇంజనీరింగ్ అధికారులు, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, మునిసిపల్ కమిషనర్ సంపత్, ఆర్టి సి, పోలీస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story