Jangaon: సర్పంచ్ వల్లాల మల్లేశం కుటుంబానికి ఎంపీ చామల పరామర్శ!
Jangaon: జనగామ మండలం పెదరమచర్ల సర్పంచ్ వల్లాల మల్లేశం మృతికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం. నివాళులర్పించిన ఎంపీ.
Jangaon: సర్పంచ్ వల్లాల మల్లేశం కుటుంబానికి ఎంపీ చామల పరామర్శ!
Jangaon: జనగామ మండలం పెదరమచర్ల గ్రామ సర్పంచ్ వల్లాల మల్లేశం మృతి చెందిన విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పెదరమచర్లలోని vallala మల్లేశం నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మల్లేశం భార్య, పిల్లలను కలిసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో మల్లేశం కుటుంబానికి అండగా ఉంటానని, కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.
అనంతరం మల్లేశం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జమాల్ షరీఫ్ అడ్వకేట్, జనగామ, వి. సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, కె. రాములు, కడకంచి శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, అభి గౌడ్, శ్రీధర్ రెడ్డి, బాల్ రెడ్డి, జి. మహేందర్, సత్యనారాయణ రెడ్డి మండల, నర్సి రెడ్డి, నర్సింగరావు, అబ్దుల్ మన్నాన్ రజీ తదితరులు పాల్గొన్నారు.




