Mogullapalli: మొగుళ్లపల్లిలో బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు
Mogullapalli: మొగుళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్‌లోకి చేరికలు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో పార్టీలోకి ఇప్పలపల్లి ఉప సర్పంచ్ వినోద్, గ్రామస్తులు.
Mogullapalli: మొగుళ్లపల్లిలో బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు
మొగుళ్ళపల్లి: కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మొగుళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. మండల మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బల్గురి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వినోద్‌తో పాటు పలువురు గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్‌తో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం తెలిపారు. గతంలో పార్టీకి దూరమైన వారు, ప్రస్తుతం తటస్థంగా ఉన్నవారు తిరిగి బీఆర్ఎస్‌లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.




