Maripeda: మరిపెడలో ప్రజా పాలన 1000 రోజుల పండుగ!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ 'ప్రజా పాలన 1000 రోజుల పండుగ' నిర్వహించారు. కేసీఆర్ వైఫల్యాలపై మండిపడ్డారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 5 Sept 2026 3:09 PM IST
Maripeda
X

Maripeda: మరిపెడలో ప్రజా పాలన 1000 రోజుల పండుగ!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో ప్రజా పాలన 1000 రోజుల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలో అనేక విజయాలు సాధించిందన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని రైతులకు సబ్సిడీల పేరుతో మోసం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story