Hanamkonda: 'నశా ముక్త్ భారత్ అభియాన్' పోస్టర్ విడుదల!

Hanamkonda: బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో '10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ' పోస్టర్‌ను ఎమ్మెల్యే నాయిని ఆవిష్కరించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 7 Aug 2026 11:20 AM IST
Hanamkonda
X

Hanamkonda: 'నశా ముక్త్ భారత్ అభియాన్' పోస్టర్ విడుదల!

Hanamkonda: బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం” పోస్టర్‌ను ఈరోజు ఉదయం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు బ్రహ్మ కుమారిస్ ప్రతినిధులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు “నశా ముక్త్ భారత్ అభియాన్ (వ్యసన ముక్త భారత ప్రచార యాత్ర)” లో భాగంగా వ్యసనాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం మాట్లాడుతూ, మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు వంటి వ్యసనాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వ్యసన రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ BK విమల, శోభ, కల్పన, అనిల్, రాఘవ చారి, శ్యామ్, అరుణ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story