Kazipet: విష్ణుపురి కాలనీలో ఘనంగా శ్రీ శివశక్తి మహంకాళి బోనాల జాతర!
Kazipet: కాజీపేట విష్ణుపురి కాలనీలో శ్రీ శివశక్తి మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది.
Kazipet: విష్ణుపురి కాలనీలో ఘనంగా శ్రీ శివశక్తి మహంకాళి బోనాల జాతర!
కాజీపేట: విష్ణుపురి కాలనీలో ప్రతియేటా అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీ శివశక్తి మహంకాళి బోనాల జాతరలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు ఆకాంక్షించారు. బోనాల జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
విష్ణుపురి కాలనీలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ జాతర భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు.




