Lingala Ghanpur: లింగాల ఘనపూర్‌లో ఎమ్మెల్యే మార్క్.. విద్యకే రూ.219 కోట్లు కేటాయింపు!

Lingala Ghanpur: లింగాల ఘనపూర్ మాడల్ స్కూల్ హాస్టల్ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.

MD AHMAD PASHA, JANGAON
Published on: 15 May 2026 6:59 PM IST
Lingala Ghanpur
X

Lingala Ghanpur: లింగాల ఘనపూర్‌లో ఎమ్మెల్యే మార్క్.. విద్యకే రూ.219 కోట్లు కేటాయింపు!

Lingala Ghanpur: రాష్ట్రంలోని 90శాతం మాడల్ స్కూల్ లలో హాస్టల్ భవనాల నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు. కానీ లింగాల ఘనపూర్ మండల కేంద్రంలోని మాడల్ స్కూల్ లో మాత్రం అనివార్య కారణాల వల్ల భవన నిర్మాణం పూర్తి కాలేదని తెలిపారు. నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత విషయం నా దృష్టికి రాగానే ప్రత్యేక చొరవ తీసుకొని 6నెలల క్రితమే కోటి 44లక్షలు మంజూరు చేయించానని తెలిపారు. ప్రస్తుతం టెండర్లు పూర్తి అయి ఈ రోజు పనులు ప్రారంభించుకున్నామని వెల్లడించారు. అలాగే కస్తూరిభా గాంధీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మరో 42లక్షలు మంజూరు చేయించి పనులు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.

నేను ఎమ్మెల్యే గా ఎన్నికైన ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్క విద్యారంగానికే 219కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 7కేజీబీవిలలో మౌలిక వసతుల కల్పనకు 8కోట్ల 19లక్షలు, వేలేరు కేజీవీబి జూనియర్ కళాశాలకు 3కోట్ల 25లక్షలు, తెలిపారు. అలాగే సంక్షేమ గురుకులాలు, కేజీబీవి, మ ప్రధాన రహదారి నుండి మాడల్ స్కూల్ గేట్ వరకు సిసి రోడ్డు నిర్మాణానికి మరియు కిచెన్ షెడ్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత మాదని ఉత్తమ ఫలితాలు సాధించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story