Hanumakonda: దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణపై ఎమ్మెల్యే కేఆర్ సమీక్ష!

Hanumakonda: దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణపై హన్మకొండలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 11 Aug 2026 5:31 PM IST
Hanumakonda
X

Hanumakonda: దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణపై ఎమ్మెల్యే కేఆర్ సమీక్ష!

హన్మకొండ: హన్మకొండ జిల్లా చింతగట్టులోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణ మరియు వినియోగంపై సమీక్ష సమావేశంలో మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు పాల్గొన్నారు.వర్షాభావ పరిస్థితులు,తాగునీటి ఎత్తిపోతలు, పంపుహౌస్‌ల పనితీరు, మరియు రిజర్వాయర్ల నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులకు సరిపడ నీటిని కాలువల ద్వారా అందజేయాలన్నారు.

ముఖ్యంగా పర్వతగిరి రిజర్వాయర్ లో నీటిని విడుదల చేయాలని, వాటి వల్ల ఎంతో మంది రైతులకు లబ్ది కలుగుతుందన్నారు.సౌత్,లెఫ్ట్ కెనాల్ ద్వారా నీటిని 15 రోజుకు నిరంతరం విడుదల చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీహరి గారు,యశస్వినిరెడ్డి గారు,గండ్ర సత్యనారాయణ రావు,ఇరిగేషన్‌ శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story