Hanamkonda: వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో రాఖీ వేడుకలు!

Hanamkonda: హన్మకొండ సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి రాఖీలు కట్టిన మల్లికంబ మనోవికాస కేంద్రం చిన్నారులు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 28 Aug 2026 5:39 PM IST
Hanamkonda
X

Hanamkonda: వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో రాఖీ వేడుకలు!

Hanamkonda: హన్మకొండ సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రక్షాబంధన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారికి హనుమకొండ మల్లికంబ మనోవికాస కేంద్రంలోని చిన్నారులు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.

చిన్నారులు ఎమ్మెల్యే గారు మిఠాయిలు పంచిపెట్టి ఆశీస్సులు అందించారు.నియోజకవర్గంలో మహిళలు కూడా ఎమ్మెల్యే గారికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు గారు,నాయకులు కృష్ణమూర్తి గారు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story