Mahabubabad: సీరోలు తహసీల్దార్ భవన శిలాఫలకం ఆవిష్కరణ!
Mahabubabad: సీరోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయ భవన శిలాఫలకాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఆవిష్కరించారు.
Mahabubabad: సీరోలు తహసీల్దార్ భవన శిలాఫలకం ఆవిష్కరణ!
మహబూబాబాద్: ఈరోజు కేసముద్రంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖల గౌరవ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, గౌరవ మంత్రి దానసరి అనసూయ (సీతక్క) గారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు మహబూబాబాద్ ఎమ్మెల్యే భుక్య మురళి నాయక్ గారు చేతుల మీదుగా సీరోలు మండల తహసీల్దార్ కార్యాలయ నూతన భవనానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీరోలు మండల తహసీల్దార్ శ్రీ అనిశెట్టి పున్నం చందర్ గారు, ఆర్‌ఐ శ్రీమతి కడియాల శ్రావణి గారు, జీపీవో శ్రీ వీరస్వామి గారు, సర్పంచ్ శ్రీ రమణ గారు, సీరోలు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ కొండపల్లి కరుణాకర్ రెడ్డి గారు, అధ్యక్షులు శ్రీ బుడిగాం లక్ష్మీ నారాయణ గారు, సీరోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గవిని వెంకన్న గారు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శ్యామల మోహన్ రెడ్డి గారు, బొల్లికొండ వెంకన్న గారు, శ్యామల సత్యం గారు, పత్తి సహదేవ గారు, గవిని రంగయ్య గారు, ఆలేటి రవి గారు, మక్కల వీరన్న గారు, అడిగే రాజు గారు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సీరోలు మండల ప్రజలకు మరింత మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించబడుతున్న తహసీల్దార్ కార్యాలయ భవనం శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.




