Narsampet: అమరవీరురాలు ఎండీ సవేరా తల్లి ఆవేదన

Narsampet: నర్సంపేట చెన్నారావుపేటలో ఒంటరిగా జీవిస్తున్న యాకుబీ.. పెన్షన్, ఇళ్ల స్థలం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నపం.

NARENDER, WARANGAL
Published on: 1 Jun 2026 3:31 PM IST
Narsampet
X

Narsampet: అమరవీరురాలు ఎండీ సవేరా తల్లి ఆవేదన

నర్సంపేట: నియోజకవర్గం తెలంగాణ ఉద్యమ సమయం లో నర్సంపేట లో ఆత్మ బలి దానాలు జరిగాయి అందులో భాగంగా చెన్నారావుపేట మండలం పాపయ్య పేట గ్రామానికి చెందిన Md సవేరా అనే ఇంటర్ చదివే యువతి తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించి ఉద్యమం లో చురుకుగా పాల్గొనేది.

అయితే తెలంగాణ రావాలని పట్టుదల తో 04.09.2010 లో ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో రాష్ట్రం లో విషాదం నెలకొన్న పరిస్థితి ఆ రోజుల్లో ఏర్పడింది. అయితే తెలంగాణ వచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక Md సవేరా కుటుంబానికి పది లక్షల ఆర్ధిక సాయం మరియు ఇంట్లో ఒకరికీ సవేరా సోదరుడు సద్దాం కీ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు.

అయితే సవేరా కుటుంబాన్ని తండ్రి వొదిలి వెళ్లిపోవడం తో సోదరుడు పెళ్లి చేసుకొని వెళ్లి పోవడం తో తల్లి Md యాకుబి ఒంటరి గా జీవిస్తుంది. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకి ఇస్తానన్న పెన్షన్ లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని సవేరా తల్లి యాకుబి వేడుకుంటుంది.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story