Mahabubabad: డోర్నకల్‌లో వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యతండలో ఆస్తి వివాదం కారణంగా చందవత్ దాసు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్.
Mahabubabad: డోర్నకల్‌లో వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి!
Mahabubabad: ఉమ్మడి ఆస్తి వివాదంలో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ చందవత్ దాసు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యతండ గ్రామంలో కలకలం రేగింది.
ఆస్తి విషయంలో కొంతకాలంగా వేధింపులు ఎదుర్కొంటున్నానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ వాటర్ ట్యాంక్ ఎక్కిన దాసు.. న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు యత్నిస్తానని హెచ్చరించినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దాసును కిందికి దించే ప్రయత్నం చేశారు. తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




