Mahabubabad: కొత్తగూడ గిరిజన కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్

Mahabubabad: నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహబూబాబాద్ కొత్తగూడ గిరిజన కళాశాల ప్రిన్సిపాల్ కల్పన సస్పెన్షన్. నిధుల దుర్వినియోగం, విద్యార్థినుల సమస్యలపై సొసైటీ నిర్ణయం.

B NARASIMHA, GUDUR
Published on: 18 July 2026 6:11 PM IST
Mahabubabad
X

Mahabubabad: కొత్తగూడ గిరిజన కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల (TGTWURJC-G) ప్రిన్సిపాల్ (FAC) టి. కల్పనను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినారనే ఆరోపణలపై తెలంగాణ గిరిజన సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ (TGTWREIS) సస్పెండ్ చేసింది. ఈ మేరకు సొసైటీ సెక్రటరీ కె. సీతా లక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

హాస్టల్ టాయిలెట్ల దుస్థితి, తాగునీటి కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 16న ఉదయం 7:50 నుండి 10 గంటల వరకు విద్యార్థినులు కళాశాల ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారుల విచారణ: ఈ ఘటనపై వచ్చిన మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కళాశాల పరిపాలనలో తీవ్ర లోపాలు ఉన్నట్లు విచారణలో తేలింది.

నిధుల దుర్వినియోగం/నిర్లక్ష్యం: టాయిలెట్ల మరమ్మతుల కోసం 2026 ఏప్రిల్‌లోనే 7 లక్షల నిధులు మంజూరైనప్పటికీ, పనులను పర్యవేక్షించడంలో మరియు నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో వెల్లడైంది. విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మరమ్మతు పనులు చేపట్టకపోవడం, నిధుల వినియోగంలో అలసత్వం ప్రదర్శించినందుకు గానూ కల్పనను తక్షణమే అమల్లోకి వచ్చేలా సస్పెండ్ చేస్తూ సొసైటీ నిర్ణయం తీసుకుంది.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story