Mahabubabad: మహబూబాబాద్‌లో టీఎంయూ గేట్ మీటింగ్.. హాజరైన అశ్వద్ధామరెడ్డి

Mahabubabad: మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి. కార్మికుల హక్కుల కోసం పోరాటం.

A.Rajkumar, Mahabubabad
Published on: 12 Aug 2026 5:56 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో టీఎంయూ గేట్ మీటింగ్.. హాజరైన అశ్వద్ధామరెడ్డి

మహబూబాబాద్: ఆర్టీసీ కార్మికులు రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చేందుకు మూకుమ్మడిగా ప్రయత్నం చేసిందని తెలంగాణా మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డిఅన్నారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ బస్సు డిపో లో జరిగిన గేట్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహబూబాబాద్ కు చేరుకున్న ఆయనకు ఆర్టీసీ కార్మికులు పూలమాలలు , శాలువాలతో సత్కరించి ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... 9 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పై దమన కాండకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేసిందని , దానికి ఆర్టీసీ కార్మికులంతా ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారన్నారు.

అమరులైన ఆర్టీసీ కార్మికుల ఆశయాలకు స్ఫూర్తిగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ పని చేస్తుందని , ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు సంపూర్ణ ఉద్యోగ భద్రత , మాస్టర్స్ స్కేల్ , గ్రాచ్యూటీ , ఆర్టీసీ కార్మికులు...కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం తదితర అంశాలే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అజెండా అని , కార్మికులకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ మాటిస్తే తప్పే యూనియన్ కాదని గుర్తు చేశారు.

త్వరలో రాబోయే ఆర్టీసీ కార్మికుల ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో మల్లయ్య , లక్ష్మయ్య , ఎం.ఆర్. రెడ్డి , రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story