Mahabubabad: గార్ల మండలంలో గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు!
Mahabubabad: మహబూబాబాద్ గార్ల మండలం సీతంపేటలో పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడి చేసి 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, బెల్లం మిశ్రమాన్ని ధ్వంసం చేశారు.
Mahabubabad: గార్ల మండలంలో గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేట గ్రామంలో గార్ల–బయ్యారం సీఐ , ఎస్సైలు ఆధ్వర్యంలో సీతంపేట గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 300 లీటర్ల బెల్లం, నీరు, ఈస్ట్ వంటి పదార్థాలను కలిపి పులియబెట్టిన ద్రవ మిశ్రమంని ధ్వంసం చేశారు.
సిఐ రవీందర్,SI సాయికుమార్ మాట్లాడుతూ..
అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తత్రలు పాల్గొన్నారు.
Next Story




