Bayyaram: ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం - బయ్యారంలో వేడుకలు

Bayyaram: మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 29 Aug 2026 5:41 PM IST
Bayyaram
X

Bayyaram: ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం - బయ్యారంలో వేడుకలు

బయ్యారం: మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట _గంధంపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలోని పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు విజయేందర్ మాట్లాడుతూ...

భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని క్రీడలు నిర్వహించామని అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి , శారీరక దృఢత్వం అలవడతాయన్నారు. విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల మనసు ప్రశాంతంగా, ఉల్లాసం ఉంటుంది, మెదడుకు ఎలాంటి ఒత్తిడి లేకపోవడం వల్ల చదువుపై శ్రద్ధ చూపేందుకు క్రీడలు దోహదపడతాయని అన్నారు.

ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆటలు ఎంతో దోహదపడతాయని, విద్యార్థులు క్రీడలను కెరీర్‌గా ఎంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి పాఠశాల నుండే ప్రత్యేకంగా క్రీడలపై మక్కువ పెంచుకోవాలని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story