Mahabubabad: మల్బరీ సాగుతో ఎకరానికి రూ.2 లక్షల ఆదాయం
Mahabubabad: మహబూబాబాద్‌లో మల్బరీ సాగుపై అవగాహన సదస్సు. పంట మార్పిడి ద్వారా మల్బరీ సాగు చేసి ఎకరానికి రూ. 2 లక్షల ఆదాయం పొందాలని అధికారుల పిలుపు.
Mahabubabad: మల్బరీ సాగుతో ఎకరానికి రూ.2 లక్షల ఆదాయం
మహబూబాబాద్: జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ, మల్బరీ సాగుతూ ఎకరానికి రెండు లక్షల ఆదాయం MERA RESHAM – MERA ABHIMAN 2.0 (నా పట్టు నా అభిమానం 2.0). నూతన రైతులకు మల్బరీ సాగు లాభదాయకం, పంట మార్పిడితో ప్రతీ గ్రామంలో 50 ఎకరాలలో అధిక ఆదాయాన్నిచ్చే మల్బరీ సాగు చేయాలి.
కేంద్ర సిల్క్ బోర్డు 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మల్బరీ సాగు విస్తీర్ణం ను పెంచే క్రమంలో నా పట్టు – నా అభిమానం 2.0 (MERA RESHAM – MERA ABHIMAN 2.0) కార్యక్రమాన్ని G.అనసూయ, జాయింట్ డైరెక్టర్, సెరికల్చర్ శాఖ వారు, కొత్తగూడ, రైతు వేదిక లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిల్క్ బోర్డు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ శాస్త్రవేత్త జె. శ్రీకాంత్ నాయక్, మల్బరీ సాగు గురించి రైతులకు పలు సాంకేతిక సలహాలు ఇస్తూ పలు సందేహాలు నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైతాంగం పంట మార్పిడి ద్వారా మార్కెట్ డిమాండ్ ఉన్న మల్బరీ సాగు చేపట్టి ఎకరానికి 2 లక్షల ఆదాయం పొందాలని తెలిపారు.
ఈ పంట ఆదాయం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో సమానం అని తెలిపారు. క్లస్టర్ స్థాయిలో సామూహికంగా మల్బరీ సాగు చేపట్టాలని దీనికి కోతులు, దొంగల బెడద లేదని, ఒక సంవత్సరం లో 5 నుండి 6 పంటలు తీసుకోవచ్చని ఎక్కువ స్థాయిలో ఎరువులు అవసరం లేదని, పురుగు మందులు అసలు అవసరం లేదని తెలుపుతు ఈ సాగు వైపు మొగ్గుచూపాలని తెలిపారు.
వరి, మొక్కజొన్న, ప్రత్తి, మిరప సాగు విస్తీర్ణం తగ్గించి ఈ మల్బరీ పంటని సాగు చేసి ఆర్ధికంగా ఎదగాలని తెలిపినారు. జినుగు మరియన్న జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఈ పంట సాగు వలన పరిశ్రమలు స్థాపించి యువతకు, స్వయం సహాయక మహిళా సంఘాలకు ఉపాదిని కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనుక రైతాంగం ఆలోచించి పంట మార్పిడి ద్వారా మల్బరీ సాగు చేయాలని తెలిపినారు.
ఈ కార్యక్రమం లో జాయింట్ డైరెక్టర్ G.అనసూయ, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారిజినుగు మరియన్న , కేంద్ర సిల్క్ బోర్డు శాస్త్రవేత్త J. శ్రీకాంత్, బెంగళూరు, సెరికల్చర్ అధికారి కే సురేష్, మండల వ్యవసాయ అధికారి జే ఉదయ్, ఉద్యాన శాఖ అధికారి శాంతి ప్రియదర్శిని, మండల ఐకేపీ ఎ. పి.ఎం రవీందర్, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజు, రాజ్ కుమార్, ఉద్యాన విస్తరణ అధికారులు B రమేష్, T. విజయ పాల్ రెడ్డి, రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




