Kothaguda: కొత్తగూడలో అదిరిపోయిన 2కే రన్.. పరుగులు తీసిన యువత, ఎస్ఐ!
Kothaguda: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికల 99 రోజుల వేడుకలు.
Kothaguda: కొత్తగూడలో అదిరిపోయిన 2కే రన్.. పరుగులు తీసిన యువత, ఎస్ఐ!
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికల 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహించిన 2కే మారధాన్ రన్ ఉత్సాహంగా సాగింది. ఈ పరుగును ఎంపీడీవో మీర్జా మునవర్ బేగ్ ప్రారంభించారు. అంబేద్కర్ సెంటర్ నుండి బైపాస్ రోడ్డు వరకు సాగిన ఈ పరుగులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. "యువతే దేశానికి ఆదర్శం" అని, యువత శారీరక దృఢత్వంతో పాటు సామాజిక చైతన్యం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు కుమార్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ మరియు స్థానిక యువజన నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Next Story




