Mahabubabad: శ్రీరామ మందిరంలో గోమయ గణపతి ప్రతిష్ఠాపన

Mahabubabad: మహబూబాబాద్ శ్రీరామ మందిరంలో మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయ గణపతి ప్రతిష్ఠాపన. పర్యావరణ పరిరక్షణకు గోమయ గణపతులను పూజించాలని పిలుపు.

A.Rajkumar, Mahabubabad
Published on: 14 Sept 2026 5:03 PM IST
Mahabubabad
X

Mahabubabad: శ్రీరామ మందిరంలో గోమయ గణపతి ప్రతిష్ఠాపన

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని శ్రీరామ మందిరం లో శ్రీ మహా లక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యం లో గోమయ గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్టు ఆధ్వర్యం లో గత 11 సంవత్సరాలుగా గోమయ విగ్రహాన్ని సంగారెడ్డి లో కొనుగోలు చేసి ఇక్కడి తీసుకుని వచ్చి ప్రతిష్టిస్తున్నారు.

నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి... ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ..... మేము మహబూబాబాద్ పట్టణంలో గత 25 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని. మొదట ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడామని.

ఈ విగ్రహాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుందని గుర్తించి ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాల బదులు మట్టి విగ్రహాలను కొన్ని సంవత్సరాలు ప్రతిష్టించామని , గత 11 సంవత్సరాలుగా గోమయ్య విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని , ఆవు పేడ , చింత గింజల పొడి , వేప ఆకుల పొడి , పసుపు , జిగురు మట్టి తదితర సహజ పదార్థాలతో ఈ విగ్రహాన్ని తయారు చేయడం విశేషం. ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన కొద్ది నిమిషాల్లోనే నీటిలో కరిగిపోవడం విశేషం. ప్రజలంతా పర్యావరణానికి కలిగించని వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad