Mahabubabad: రోడ్డుపై వరినాట్లు వేసి సి.పి.ఐ వినూత్న నిరసన
Mahabubabad: మహబూబాబాద్ 22వ వార్డులో 3 ఏళ్లయినా సీసీ రోడ్లు నిర్మించలేదని వినూత్న నిరసన. బురద రహదారిపై వరి నాట్లు వేసి సి.పి.ఐ, కాలనీవాసుల ఆందోళన.
Mahabubabad: రోడ్డుపై వరినాట్లు వేసి సి.పి.ఐ వినూత్న నిరసన
మహబూబాబాద్: సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణం చేయకపోవడాన్ని నిరసిస్తూ సి.పి.ఐ పార్టీ ఆధ్వర్యం లో కాలనీ వాసులు రహదారుల పై వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ మున్సిపాలిటీ లోని 22 వ వార్డు కొండపల్లి గోపాల్ రావు నగర్ లో సి.సి రోడ్లు నిర్మాణానికి 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు గడుస్తున్నా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షాలకు రహదారులన్నీ బురద మాయంగా మారి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ వాసుల ఇబ్బందులు తొలగించాలంటూ
సి.పి.ఐ పార్టీ శ్రేణులు రహదారి పై వరి నాట్లు వేసి నిరసన చేపట్టారు.ఈ విషయం పై సిపిఐ నాయకుడు చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ, చిన్న చిన్న వర్షాలకే కాలనీ లోని రహదారులన్నీ బురదమయంగా మారాయని , చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని , ప్రభుత్వం వెంటనే స్పందించి శంకుస్థాపన చేసిన రహదారులకు వెంటనే నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు , కార్యకర్తలు , కాలనీ వాసులు పాల్గొన్నారు




