Mahabubabad: కేసముద్రంలో ఓటర్ల సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పరిశీలన

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో ఓటర్ల ప్రత్యేక సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 8 Sept 2026 5:16 PM IST
Mahabubabad
X

Mahabubabad: కేసముద్రంలో ఓటర్ల సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పరిశీలన

మహబూబాబాద్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని ఓటర్ల అభ్యంతరాల ఫారాలను సిబ్బంది చేత బి.ఎల్.ఓ లాగిన్ లో ఆన్ లైన్ లో నమోదు చేయించారు. ఆన్ లైన్ లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఓటర్ల దరఖాస్తులను పరిశీలించి వారి వివరాలను నమోదు చేయాలని అన్నారు.

ఓటర్లు తమ పేర్ల నమోదు, తొలగింపు, సవరణలకు సంబంధించి అందజేసిన అభ్యంతరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి, సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ అనేది పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా జరగాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం. వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి, సకాలంలో పరిష్కరించాలన్నారు.

ఎవరి పేరు అనర్హంగా తొలగించబడకుండా, అర్హుల పేర్లు తప్పనిసరిగా చేర్చేలా చర్యలు తీసుకుంటున్నాం" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం, తహశీల్దార్ వివేక్ ఎం.పి.డి. ఓ అఫ్సర్ పాషా, బి.ఎల్.ఓ, జి. పి.ఓ లు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story