Mahabubabad: బయ్యారం హాస్టల్‌ను తనిఖీ చేసిన సీఐ, ఎస్‌ఐ

Mahabubabad: బయ్యారం హాస్టల్‌లో విద్యార్థుల వసతి, భోజన సౌకర్యాలను సీఐ రవీందర్, ఎస్‌ఐ ప్రశాంత్ బాబు పరిశీలించి, సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 8 Sept 2026 9:58 PM IST
Mahabubabad
X

Mahabubabad: బయ్యారం హాస్టల్‌ను తనిఖీ చేసిన సీఐ, ఎస్‌ఐ

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని హాస్టల్‌లోని పరిసరాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు, మెనూ, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి CI,SI వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ ...విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణతో జీవించాలని సూచించారు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి పద్ధతులే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు.

అలాగే విద్యార్థులు ఎటువంటి సమస్య ఎదురైనా భయపడకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ముఖ్యంగా హాస్టల్‌లో అందిస్తున్న భోజనం, మెనూ విషయంలో ఏమైనా ఇబ్బందులు లేదా లోపాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

హాస్టల్ భద్రత విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, బయటి వ్యక్తులకు హాస్టల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినట్లయితే వెంటనే హాస్టల్ నిర్వాహకులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, OTPలు, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు.

అదేవిధంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యం, చదువు, కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, ఇతర విద్యార్థులను కూడా వాటి బారిన పడకుండా చైతన్యపరచాలని సూచించారు.

అనంతరం సీఐ రవీందర్, ఎస్‌ఐ ప్రశాంత్ బాబు విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో భోజనం చేశారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వారికి పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు...

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story