Mahabubabad: ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం

Mahabubabad: మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం, తోపులాటతో ఉద్రిక్తత.

A.Rajkumar, Mahabubabad
Published on: 3 Sept 2026 11:03 PM IST
Mahabubabad
X

Mahabubabad: ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన బిజెపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు... బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు బలవంతంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి వాహనాల్లో కురవి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాదు లో బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని బీజేపీ కార్యాలయం నుంచి బిజెపి నాయకులు , కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి బయలుదేరారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ర్యాలీగా వస్తున్న బిజెపి శ్రేణులను పోలీసులు రహదారి పై పోలీస్ వ్యాన్ ను అడ్డం పెట్టి రోప్ ద్వారా మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు... బిజెపి శ్రీనుల మధ్య వాగ్వాదంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అందరినీ అదుపులకు తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story