Mahabubabad: కేసముద్రంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించిన విద్యార్థి.
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో వివేకవర్ధిని విద్యార్థి సామాజిక బాధ్యత చాటాడు కరస్పాండెంట్ స్ఫూర్తితో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి దారి కల్పించాడు
Mahabubabad: కేసముద్రంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించిన విద్యార్థి.
మహబూబాబాద్ జిల్లా
ప్రేరణతో సమాజ సేవ వైపు విద్యార్థి అడుగు
శ్రీ వివేకవర్ధిని హై స్కూల్, కేసముద్రం మా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ చిర్ర యాకాంతం గౌడ్ గారు ప్రతిరోజూ విద్యార్థులకు విద్యతో పాటు మానవత్వం, సామాజిక బాధ్యత, సేవాభావం గురించి ప్రేరణాత్మక సందేశాలు అందిస్తుంటారు.
ఆ ప్రేరణను ఆచరణలో చూపిస్తూ మా పాఠశాల విద్యార్థి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును తొలగించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించాడు.ఈ సంఘటన మనకు అందించే
విద్య అంటే పుస్తక జ్ఞానం మాత్రమే కాదు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగడం. మంచి మాట విద్యార్థి ఆలోచనను మార్చగలదు; మంచి ఆలోచన మంచి పనికి నాంది పలుకుతుంది.
చిన్న వయస్సు నుంచే సేవాభావం, బాధ్యత, మానవత్వం అలవర్చుకోవాలి.సమస్యను చూసి వెళ్లిపోవడం కాకుండా, సాధ్యమైనంత వరకు పరిష్కారంలో భాగస్వాములు కావాలి.
ప్రతి విద్యార్థి తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి పౌరుడిగా ఎదగాలి.కరస్పాండెంట్ సందేశం నా మాటలతో వందమంది మారాలని నేను కోరుకోను,నా మోటివేషన్ విని ఒక్క విద్యార్థి మంచి మార్గంలో నడిచినా చాలు.
ఆ ఒక్కరిలో వచ్చిన మార్పు మరెందరికో స్ఫూర్తిగా మారుతుంది.
విద్యార్థిని మంచి మార్కులు సాధించే వ్యక్తిగా మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే మంచి మనిషిగా తీర్చిదిద్దడమే నిజమైన విద్య శ్రీ చిర్ర యాకాంతం గౌడ్ కరస్పాండెంట్
శ్రీ వివేకవర్ధిని హై స్కూల్




