Kesamudram: మర్డర్ కేస్ క్లోజ్.. భార్యతో సహా ముగ్గురు నిందితుల అరెస్ట్

Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో జరిగిన కుండే నరేష్ (32) హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 17 Jun 2026 5:25 PM IST
Kesamudram
X

Kesamudram: మర్డర్ కేస్ క్లోజ్.. భార్యతో సహా ముగ్గురు నిందితుల అరెస్ట్

కేసముద్రం: మండలంలో హత్య కేసు ఛేదన - ముగ్గురు నిందితుల అరెస్ట్. కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుండే నరేష్ (32 సంవత్సరాలు) హత్యకు సంబంధించిన కేసును కేసముద్రం పోలీసులు వేగంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తేదీ 15.06.2026 రాత్రి సుమారు 09:30 గంటల సమయంలో ఉప్పరపల్లి గ్రామంలో కుండే నరేష్ హత్యకు గురైన ఘటనపై, మృతుడి తండ్రి అయిలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ఈ రోజు కేసముద్రం సీఐ వై. సత్యనారాయణ, ఎస్సై క్రాంతి కిరణ్ మరియు సిబ్బంది. కేసముద్రం గ్రామ శివారులోని కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, కేసుకు సంబంధించిన నిందితులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ చేసిన నిందితులు: కంకాల కుమారస్వామి, ఉప్పరపల్లి గ్రామం, కుండే అనూష, మృతుడు నరేష్ భార్య, ఉప్పరపల్లి గ్రామం. కంకాల కలమ్మ ఉప్పరపల్లి గ్రామం పంచుల సమక్షంలో విచారణ జరపగా, కుటుంబ కలహాలు, మృతుడి మద్యపానం, భార్యపై తరచూ శారీరక మరియు మానసిక వేధింపులు, ఇతర మహిళలతో సంబంధాలపై వివాదాలు కారణంగా గత కొంతకాలంగా కుటుంబంలో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లు వెల్లడైంది.

తేదీ 15,06,2026న కుటుంబ వివాదం నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కౌన్సెలింగ్ అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా మృతుడు నిందితులతో గొడవపడినట్లు విచారణలో తేలింది. అనంతరం నిందితులు ముందస్తు పథకం ప్రకారం ఇనుప రాడ్డును సిద్ధంగా ఉంచుకొని, అదే రోజు రాత్రి మృతుడు ఇంటి వద్దకు వచ్చి గొడవ సృష్టించిన సమయంలో అతడిని అదుపులోకి తీసుకుని ఇనుప రాడ్డుతో తలపై పలుమార్లు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

నిందితుల నేర ఒప్పుకోలు ఆధారంగా హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు మరియు సంఘటన అనంతరం పరారయ్యేందుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టి కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరిగింది. కేసముద్రం పోలీసులు మాహాబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story